ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల మార్పుతో ఎవరి స్థానంలో ఎవరు వస్తారనే దానిపై సర్వత్రా చాలా ఆసక్తి నెలకొంది.ఇందులో భాగంగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న మంత్రివర్గ మార్పుల్లో ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో ఒక లుక్ వేద్దామా.. రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పోస్ట్ దక్కనున్నట్లు తెలుస్తోంది.
మంత్రి కొడాలి నానిని మార్చాలనుకుంటే నాని స్థానంలో వసంత కృష్ణప్రసాద్, పేర్ని నాని స్థానంలో సామినేని ఉదయభాను, వెల్లంపల్లి స్థానంలో అన్నె రాంబాబు, కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, జోగి రమేశ్, తూ.గో నుంచి పొన్నాడ సతీశ్ పేర్లు ఏపీ పాలిటిక్స్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.గుంటూరు నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, విడదల రజినీ, మేరుగు నాగార్జున రేసులో ఉన్నారు. ఆదిమూలపు స్థానం సుధాకర్ బాబుకు దక్కే అవకాశం ఉంది.
చిత్తూరు నుంచి రోజా, భూమన, మధుసూదన్ రెడ్డి, కర్నూలు నుంచి చక్రపాణిరెడ్డి, కాటసాని, కంగాటి శ్రీదేవి, అనంతపురం నుంచి కాపు రామచంద్రారెడ్డి, ఉషా చరణ్ శ్రీ, జొన్నలగడ్డ పద్మావతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కడప నుంచి అంజాద్ బాషాకు ఛాన్స్ దక్కేలా ఉంది.మంత్రి బొత్స ప్లేసులో కోలగట్ల వీరభద్రస్వామి, అప్పలనర్సయ్య పేర్లు వినిపిస్తున్నాయి. పుష్పశ్రీ వాణి స్థానంలో రాజన్నదొర, భాగ్యలక్ష్మి, అరకు ఫల్గుణ, పోలవరం బాలరాజు, అవంతి స్థానంలో గుడివాడ అమర్నాథ్ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.చూడాలి మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎవర్ని ఉంచుతారో.. ఎవర్ని తీస్తారో.. ఎవర్ని తీసుకుంటారో..?