భారత రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరు ప్రతిపాదించినట్లు ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విధితమే. సోషల్ మీడియాలో ముప్పవరపు వెంకయ్య నాయుడు గురించి వచ్చిన వార్తలపై ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది.
మీడియా, సామాజిక మాధ్యమాలలో వస్తున్నవన్నీ వదంతులేనని ఉపరాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. అయితే మంగళవారం ఉదయం నుండి భారత రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పేరు ప్రతిపాదించారని ఎలక్ట్రానిక్ , సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లుకొట్టాయి.