జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ లాకర్ రూమ్‌లో ఓ వృద్ధుడు ఏకంగా 18 గంటల పాటు ఉండిపోయాడు. రోడ్డు నంబర్ 67లో నివసించే 84 ఏండ్ల కృష్ణారెడ్డి అనే వ్యక్తి నిన్న సాయంత్రం 4.30 సమయంలో యూనియన్ బ్యాంక్‌కు వెళ్లారు. లాకర్‌కు సంబంధించిన పని ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. అయితే లాకర్ రూమ్‌లో కృష్ణారెడ్డి ఉండగానే అక్కడి సిబ్బంది గమనించకుండా లాక్ చేసి వెళ్లిపోయారు.
దీంతో కృష్ణారెడ్డి నైట్ అంతా లాకర్ రూమ్‌లోనే గడిపారు. అప్పటికే ఆయన మిస్సింగ్ అయినట్లు భావించిన కుటుంబసభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి యూనియన్ బ్యాంక్ సీసీ కెమెరాలను పరిశీలించగా లాకర్ గదిలో కృష్ణారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. ఆ వృద్ధుడికి షుగర్ ఉండటంతో అప్పటికే సొమ్మసిల్లిపడ్డారు. దీంతో వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.