జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ఏపీ సీఎం కాకపోతే తమ ఫ్యామిలీ పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు గెలుస్తుందంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్‌పై కృష్ణదాస్ స్పందించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయలో జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.
అచ్చెన్నాయుడి మాటలకు భయపడాల్సిన పనిలేదని.. టీడీపీ 160 స్థానాలను గెలుస్తుంటే తాము గాజులు వేసుకుని కూర్చొంటామా? అని కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని.. మళ్లీ జగనే సీఎం అవుతారని చెప్పారు.