మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి విదితమే. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ నుండి మరో మూవీ ప్రకటన వచ్చింది. వరుణ్ కథానాయకుడిగా పన్నెండువ చిత్రంగా సోమవారం హైదరాబాద్ మహానగరంలో ప్రారంభమైంది.
శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు,బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తండ్రి మెగా హీరో నాగబాబు కొణిదెల సమర్పకులు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి.
ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు క్లాప్ నిచ్చారు. నాగబాబు సతీమణి వరుణ్ తేజ్ తల్లి పద్మజ కెమెరా స్విచాన్ చేశారు. వీరిద్దరూ సంయుక్తంగా స్క్రిప్ట్ ను అందజేశారు.మికీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. ముఖేష్ ఛాయాగ్రహణ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా కళా దర్శకుడు.