మీరు ట్విట్టర్ వాడుతున్నారా..?. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ట్విట్టర్ వాడకుండా అసలు ఉండలేరా..?. కాస్త సెటైరికల్ గా చెప్పాలంటే ట్విట్టర్ నే తింటూ ట్విట్టర్లోనే నిద్రపోతున్నారా..?. అయితే ఈ వార్త తప్పకుండా మీరు చదవాల్సిందే. అదే ఏంటంటే ట్విట్టర్ కు పోటిగా కొత్త సోషల్ మీడియా వేదిక రానున్నది. ట్విట్టర్ కు పోటిగా సరికొత్త సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేయాలని టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఆలోచిస్తున్నారు.
ట్విట్టర్ వేదికగా కొత్త సోషల్ మీడియాను కొనే ఉద్ధేశ్యం ఉందా అని తాజాగా ప్రణయ్ అనే వ్యక్తి ఎలాన్ మస్క్ ను అడిగారు. దీనికి మస్క్ జవాబు ఇస్తూ దీని గురించి నేను చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని ట్విట్టర్ చాలా చిన్నచూపు చూస్తుంది. భావప్రకటనా స్వేఛ్చకు విఘాతం కలిగిస్తున్నదని దీనిపై ఏం చేయాలని ఆయన ట్విట్టర్ యూజర్లను ప్రశ్నించారు. అంతేకాకుండా కొత్త సోషల్ మీడియా వేదిక అవసరం ఉందా అని కూడా ఆయన ప్రశ్నించారు.