గోవా రాష్ట్ర ముఖ్య మంత్రిగా ప్రమోద్ సావంత్ ఈ రోజు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, హర్యానా సీఎం ఖట్టర్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తదితరులు హాజరయ్యారు. గోవా రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ప్రమోద్ సావంత్ కు ఇది రెండోసారి కావడం గమనార్హం . గతంలో అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ అకాల మరణంతో తొలిసారి 2019 మార్చిలో ప్రమోద్ సావంత్ సీఎం పీఠం ఎక్కారు.
