రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి ,యూపీ మాజీ సీఎం మాయవతిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నిలబెడుతుందని వార్తలు వస్తున్న సమయంలో క్లారిటీచ్చారు ఆమె. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ” ఏ పార్టీ నుండి అయిన సరే రాష్ట్రపతి పదవి ఇస్తామని నాకు ఇప్పటివరకు ఏ ప్రతిపాదనలు రాలేదు.
ఒకవేళ ఏ ప్రతిపాదన అయిన వస్తే తాను అంగీకరించే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఒకవేళ ఇతర పార్టీలు ఆఫర్ చేసిన రాష్ట్రపతి పదవిని చేపడితే అక్కడితో మన రాజకీయ భవిష్యత్తు ఆగిపోతుంది.
గతంలో కాన్సీరాం గారు కూడా దీన్ని అంగీకరించలేదని .. నేను ఆయన శిష్యురాల్ని. అందుకే నేను అంగీకరించను అని ఆమె అన్నారు. యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే బీఎస్పీ అధినేత్రి మాయవతి రాష్ట్రపతి అవుతారని బీజేపీ చేసిన ప్రచారం మా పార్టీ క్యాడర్ను గందరగోళంలోకి నెట్టాయని ఆమె వాపోయారు.