యాదాద్రిలో ఈ రోజు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం జరిపించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిభక్తునిగా ఈరోజు పూజలు జరిపించారు.
మాన్య ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ వచ్చిన తరువాత తన సంకల్పం తో యాదాద్రి పునర్నిర్మించ దలిచారు తన సంకల్పంతో ఈరోజు దాన్ని సాకారం చేసారు , యాదాద్రి ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించారు,సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దాదాపు రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో యాదాద్రి పునర్నిర్మాణాన్ని చేపట్టారు.
ఇది అసాధారణ నిర్మాణం. సీఎం కేసీఆర్ శ్రీకృష్ణదేవరాయలులాగా నిలిచి, ఆలోచనలు పంచి, ఆర్థిక వనరులు కల్పించి కట్టించారు, కెసిఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు, అలాగే ఈ మహత్తర మైన గుడి నిర్మాణములో పాలుపంచుకున్న ఆర్కిటెక్ట్ ఆనందసాయి, ఈవో శ్రీమతి గీతారెడ్డి, ఇతర అధికారులు, అర్చకస్వాములు అందరికి గుర్రాల నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.