బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై భక్తియార్ పూర్ లో ఆదివారం దాడి జరిగింది. స్వాతంత్ర్య సమరయోధుడు శిల్ భద్ర యాజీ నివాళి కార్యక్రమం నిన్న ఆదివారం భక్తియార్ పూర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన సీఎం నితీశ్ కుమార్ పై ఓ యువకుడు దాడికి దిగాడు.
సీఎంపైకి దాడికి దిగిన యువకుడ్ని అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే అదుపులో తీసుకున్నారు. ఇరవై ఐదేండ్లున్న నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు మంత్రి ముఖేష్ సహానిని తప్పిస్తూ సీఎం నితీశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
సహాని అధ్యక్షుడిగా ఉన్న వికాస్ షీల్ ఇన్సాస్ ఎన్డీఏలో భాగం కాదని బీజేపీ చేసిన సూచనతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దాడికి దిగిన యువకుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.