ధాన్యం సేకరణపై పరిష్కారం దిశగా తాము ఆలోచిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు.
ధాన్యం సేకరణపై పెద్దన్న పాతర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. దుర్మార్గం వ్యవహరిస్తోందని సుమన్ విమర్శించారు. బీజేపీ నేతలు బుద్ధి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. వారి తీరున ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దెబ్బతీసేలా మాట్లాడారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని బాల్క సుమన్ అన్నారు.