ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో భారత్ జట్టు ఓడిపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగినా.. ఆఖరికి విజయం సౌతాఫ్రికానే వరించింది. ఈ ఓటమితో భారత్ జట్టు సెమీస్‌కు క్వాలిఫై కాకపోవడంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 274 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా చివరి ఓవర్ చివరి బంతికి విజయం సాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఓ దశలో భారత్ జట్టు విజయం సాధిస్తుందని భావించినా దక్షిణాఫ్రికా బ్యాటర్స్ పోరాట పటిమతో తమ జట్టుకు విజయాన్ని అందించారు. సౌతాఫ్రికా టీమ్‌లో లారా ఓవార్డ్ అత్యధికంగా 80 రన్స్ చేయగా.. లారా గుడల్ 49, మిగ్నన్ డుప్రిజ్ 52, కాప్ 32, సున్ లుస్ 22 పరుగులు చేశారు.