ఇండియన్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. స్విస్ ఓపెన్ టైటిల్‌ను గెలుపొంది మరోసారి తన సత్తా చాటింది. స్విట్జర్లాండ్‌లోని బసెల్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో థాయ్‌లాండ్ షట్లర్ బుసనన్‌పై సింధు విజయం సాధించింది.
బుసనన్‌పై 21-16, 21-8 తేడాతో వరుస సెట్లలో సింధు గెలుపొంది స్విస్ ఓపెన్ సూపర్ 300 టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌ను సింధు కేవలం 49 నిమిషాల్లోనే ముగించింది. సింధు స్విస్ ఓపెన్ టైటిల్ సాధించడంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు ఇదే టోర్నీ మెన్స్ ఫైనల్లో టీమ్ ఇండియా షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ఓడిపోయాడు. ఇండోనేసియాకు చెందిన జోనాథన్ క్రిస్టీతో జరిగిన టైటిల్ పోరులో 12-21, 18-21 తేడాతో ఓటమిపాలయ్యాడు.