తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియుడి కళ్ల ముందే ప్రియురాలిపై ముగ్గురు వ్యక్తులు రేప్ చేశారు. ఈ ఘటన వేలచ్చేరి బీచ్‌లో చోటుచేసుకుంది. విర్దునగర్ జిల్లా అరుప్పుకోట ప్రాంతానికి చెందిన యువతి, ఆమె ప్రియుడు ఈనెల 23న బీచ్‌కు వెళ్లారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుండగా ముగ్గురు వ్యక్తులు ప్రియుడిపై దాడి చేసి అతడి కళ్ల ఎదుటే ప్రియురాలిపై రేప్ చేశారు.
ఆ తర్వాత ఆమె మెడలోని నగలను దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘోర ఘటనపై తీవ్ర మస్తాపానికి గురైన ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.