ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు.రిలయన్స్ సంస్థల నుంచి అక్రమ రీతిలో విదేశాలకు నిధులు మళ్లించారన్న ఆరోపణలపై అనిల్‌తో పాటు మరో ముగ్గురిపై ట్రేడింగ్ మార్కెట్ ఆంక్షలు విధించింది. లిస్టెడ్ కంపెనీతో సంబంధాలు ఉండవద్దు అని సెబీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అనిల్ అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
సెబీ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం రిలయన్స్ పవర్ బోర్డు నుంచి తప్పుకుంటున్నట్లు ఆ సంస్థ తన బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొన్నది. అలాగే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బోర్డు నుంచి కూడా అనిల్ అంబానీ వైదొలుగుతున్నట్లు మరో ఫైలింగ్‌లో వెల్లడించారు. స్వతంత్ర డైరక్టర్ హోదాలో అదనపు డైరెక్టర్‌గా రాహుల్ సారిన్‌ను నియమిస్తున్నట్లు రిలయన్స్ సంస్థలు వెల్లడించాయి.