గిరిజన బిడ్డ కల్పన ప్రేరణగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం 10 లక్షల మంది ఆడ పిల్లల జీవితాలలో వెలుగులు నింపింది అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. కల్పన వల్ల తెలంగాణ వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై ఆమె కూతురు చంద్రకళ పెళ్లికి లక్షా 116 రూపాయలతో ఆర్థిక సాయంగా నిలవడం సీఎం కేసిఆర్ గారి ముందుచూపునకు నిదర్శనమన్నారు. ఈ పెళ్లికి పెద్దలుగా వ్యవహరించి, వివాహం జరిపించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పెద్ది స్వప్న దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. కల్పన బిడ్డ చంద్రకళ పెళ్లికి నర్సంపేటలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ “ఆరోజు కేసిఆర్ గారు ఉద్యమ నాయకులుగా, జిల్లా బాధ్యులుగా పెద్ది సుదర్శన్ రెడ్డి కల్పన పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అగ్ని ప్రమాదంలో మాడిపోయాయి అని ఏడుస్తుంటే…చలించిన కేసిఆర్ గారు ఆమె పెళ్లి తానే చేస్తానని చెప్పి, 50 వేల రూపాయల ఇచ్చి, వివాహాం చేశారు.తెలంగాణ వచ్చాక కల్పన పడిన బాధ, ఆమె పెళ్లి స్ఫూర్తితో కళ్యాణ లక్ష్మి పథకం పెట్టారు.మొదట్లో ఈ పథకం కింద 51 వేల రూపాయలు, తరవాత 75 వేల రూపాయలు ఇచ్చి, ఇపుడు లక్షా 116 రూపాయిలు ఇస్తున్నారు.
ఇప్పటికీ 9వేల కోట్ల రూపాయలు ఇచ్చి, 10 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చారు.గిరిజన కుటుంబాల్లో నేడు పెళ్లికి ఈ కళ్యాణ లక్ష్మీ ఎంతో ఉపయోగపడుతోంది. కళ్యాణ లక్ష్మీతో ఆగకుండా పెళ్లయిన తర్వాత గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కాగానే కేసిఆర్ కిట్ ఇస్తున్నారు. దీంతో పాటు 12వేల రూపాయలు కూడా గర్భిణీ అయిన ఆరు నెలల నుంచి ప్రసవం అయిన మూడు నెలల వరకు ఇస్తున్నారు. ఆడపిల్ల పుడితే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ గారు పెట్టిన పథకాలు నేడు దేశానికి ఆదర్శంగా మారాయి.కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే నిధులు ఆడపిల్ల పెళ్లికి ఆలస్యం కావద్దని వీటిని గ్రీన్ ఛానల్ లో పెట్టారు.మహిళల కష్టం తెలిసిన సీఎం కేసిఆర్ గారు నేడు వారిని అన్ని విధాల ఆదుకుంటున్నారు.తెలంగాణలో సీఎం కేసిఆర్ పాలన ఈ 7 ఏళ్లు స్వర్ణ యుగం.చిన్న వయసులో పెద్ద మనసుతో కల్పన కూతురు చంద్రకళ వివాహం చేస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కల్పన కుటుంబంతో పాటు గిరిజన కుటుంబాల అందరి ఆశీస్సులు ఉంటాయి.కల్పన తన పెళ్లి కోసం కేసిఆర్ గారు సాయం చేస్తే తన బిడ్డకు చంద్రశేఖరరావు గారి పేరు వచ్చేలా చంద్రకళ అని పెట్టారు. అదేవిధంగా కొడుకుకు చంద్రహాసన్ పెట్టడం గిరిజనుల కృతజ్ణతభావానికి నిదర్శనం.
ఉద్యమ నాయకులుగా కేసిఆర్ గారు చేసిన పెళ్లి…ఆ తర్వాత ఆ పెళ్లి కూతురు బిడ్డ చంద్రకళకు 20 ఏళ్ల తర్వాత వివాహం కావడం, దానికి మేమంతా హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నాను.అంతే కాకుండా కేసిఆర్ గారి నాయకత్వంలో మంత్రిగా ఇలా ఎంతోమంది గిరిజన బిడ్డల పెళ్ళిళ్ళు చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం.నాకు దైవ సమానులైన కేసిఆర్ గారికి ఈ అవకాశం కల్పించినందుకు పాదాభివందనాలు.ఇలాంటి గొప్ప నాయకులు సీఎం కేసిఆర్ గారికి మరింత శక్తిని ఇచ్చి దేవుణ్ణి పాలించే అవకాశం ఇవ్వాలి.పెళ్లి అనంతరం నూతన వధూవరులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన సతీమణి స్వప్న లు కలిసి ఇ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.పెళ్లికి హాజరైన మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు నూతన వధూవరులకు కొత్త బట్టలు పెట్టి, ఇంటి సామాగ్రి కొనుగోలు కోసం 25 వేల రూపాయలు ఇచ్చారు అని అన్నారు.