వచ్చే ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.ఈ రోజు శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఏప్రిల్ రెండు వరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పందన కోసం చూస్తాము…
ఎలాంటి స్పందన లేకపోతే ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నారన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.