ఎయిరో స్పేస్ (aerospace) తయారీ హబ్‌గా హైదరాబాద్ (Hyderabad) ఎదుగుతున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏవియేషన్ షోకు ఆతిథ్యమివ్వడం హైదరాబాద్‌కు గర్వకారణమన్నారు. ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు రాష్ట్రానికి ప్రాధాన్య రంగాలని ఆయన చెప్పారు.
హైదరాబాద్ బేగంపేటలో జరుగుతున్న ఏవియేషన్ షోలో భాగంగా వింగ్ ఇండియా ఏవియేషన్ సదస్సును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్లయింగ్ ఫర్ ఆల్ విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు.పాత విమానాశ్రయాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను అభివృద్ధికి చేస్తున్నామన్నారు. వాటర్ ఎయిరో డ్రోమ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో హెలీప్యాడ్ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. డ్రోన్ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం తన విజన్‌ను చాటిచెప్పిందన్నారు