తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు విడుదలైన చిత్రం RRR.
మరి ఈ మూవీ గురించి చూసిన పబ్లిక్ ఏమనుకుంటూన్నారో ఇప్పుడు తెలుస్కుందామా…?. ఈ రోజు శుక్రవారం తెల్లారుజామున నుండే ఆర్ఆర్ఆర్ స్పెషల్ షోలు మొదలయ్యాయి. అయితే అంతకుముందే యూఎస్ లో ప్రీమియర్స్ షోలు నడిచాయి. మొత్తంగా ఈ సినిమా అందరి అంచనాలకు మించి ఉందని పబ్లిక్ టాక్ విన్పిస్తుంది. ఒక్క మెగా నందమూరి అభిమానులకే కాదు యావత్ సినిమా ప్రేక్షక లోకానికి ఇది అత్యంత భారీ సర్ ప్రైజింగ్ గిఫ్ట్ అని అందరూ మాట్లాడుకుంటున్నారు.
అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కొమురమ్ భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఆదరగొట్టారని సినిమా చూసిన వాళ్లంతా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ సినిమా బాహుబలి ని మించి రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామీను కురిపిస్తుందని ఇటు అభిమానులతో పాటు సినీ ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి అందరి అంచనాలను మించి మరోక్కసారి తెలుగు సినిమా సత్తాను విశ్వ ఖ్యాతి చేశాడని జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.