ఒకవైపు అందాలను ఆరబోస్తూ.. మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న హాట్ బ్యూటీ శ్రద్ధాకపూర్. తాను నటించిన తొలి చిత్రం నుండే ఇటు అందంతో పాటు అటు నటనతో ఎంతోమంది అభిమానుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.
కోట్ల మంది అభిమానుల మదిని దోచుకున్న ఈ ముద్దుగుమ్మ మాత్రం ఒకరికి మాత్రం సొంతమైంది. గత నాలుగేండ్ల నుండి రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆ బంధానికి బ్రేకఫ్ చెప్పినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇటీవల గోవాలో జరిగిన శ్రద్ధాకపూర్ పుట్టిన రోజు వేడుకల్లో రోహన్ శ్రేష్ఠ లేకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూర్చుతుంది. అయితే వీరిద్దరి బ్రేకఫ్ గురించి ఇటు శ్రద్ధా కానీ అటు రోహన్ కానీ ఇంతవరకు ఏమి మాట్లాడలేదు. అయితే వీరిద్దరూ రిలేషన్ల ఉన్న కానీ ఇంతవరకు ఎక్కడ కూడా పబ్లిక్ గా చెప్పలేదు కానీ బయట ఎక్కువగా వీరిద్దరూ తిరుగుతూ కన్పించారు.