ఒకవైపు యాక్టింగ్ మరోవైపు అదరగొట్టే డ్యాన్స్ ..ఇంకోవైపు మత్తెక్కించే బక్కపలచు అందాలను సొంతం చేసుకున్న సుందరి సాయి పల్లవి. కథ ఏదైన పాత్ర ఏదైన సరే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మూవీలో ఏ పాత్ర అయిన సరే తానే చేయగలదు అని ఇటు నిర్మాతలు అటు దర్శకులు అనుకునే హీరోయిన్లలో ఒకరుగా సాయిపల్లవి నిలుస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
ఇటీవలే నేచూరల్ హీరో నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో దేవదాసి పాత్రలో నటించి విమర్శకుల నుండి సైతం ప్రశంసలు పొందింది ఈ ముద్దు గుమ్మ. ఈ చిత్రం తర్వాత సాయిపల్లవి ఎక్కడా కూడా వార్తల్లో లేదు. శర్వానంద్ హీరోగా వచ్చిన ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో తప్పా.
ప్రస్తుతం రానాతో కల్సి నటిస్తున్న విరాట పర్వం మూవీ తప్పా సాయిపల్లవి చేతిలో ఏ ప్రాజెక్టు లేదు. ఇంతకూ తమ అభిమాని హీరోయిన్ కన్పించకపోవడంతో అభిమానులు కలవరపడుతున్నారు. ప్రస్తుతం తమ అందాల రాక్షసి ఎక్కడ ఉంది. తర్వాత ప్రాజెక్టు ఏంటి అని సాయిపల్లవి క్లారిటీవ్వాలని ఎదురు చూస్తున్నారు పల్లవి లవర్స్ ..