తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మూవీ బాహుబలి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా.. విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ,అందాల రాక్షసి అనుష్క శెట్టి,తమన్నా భాతియా ,సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. ఆ తర్వాత అంత స్థాయిలో హిట్ అయిన తాజా చిత్రం పుష్ప.
సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మాణంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా .నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా వచ్చిన పుష్ప మూవీలోని ఐటెం సాంగ్ ఊ అంటావా… ఊఊ అంటావా అనే పాట యావత్ సినీ లోకాన్ని ఒక ఊపు ఊపింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప 2 చిత్రీకరణ వేగంగా జరుగుతుంది.
అయితే పుష్ప పార్ట్ -1లో సమంత చేసిన ఐటెం సాంగ్ కు ముందు దిశా పటానిని అడిగారు అంట. అయితే డేట్స్ లేకపోవడం. ఈ పాట చేయడానికి ఈ ముద్దుగుమ్మ నో చెప్పడంతో సమంత వైపు తిరిగింది అంట చిత్రం యూనిట్. అయితే పార్ట్ – 2లో కూడా పెట్టే ఐటెం సాంగ్ కు దిశాపటానిని అడిగారు అంట మళ్లీ. మొదటి పార్ట్ లో వచ్చిన ఆదరణను చూసి ఈ హాట్ బ్యూటీ ఒకే అన్నదని సమాచారం. అయితే దీనిపై చిత్రం యూనిట్ ప్రకటించాల్సి ఉంది.