కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ ( ఈస్ట్ ) వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ కాలనీలో నూతనంగా సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు స్థంబాలు మరియు పార్క్ లో పిల్లల ఆట సామగ్రి ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. కాలనీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూగర్భడ్రైనేజీ అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, అవసరమైన మౌలిక సదుపాయాలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.