సామాన్యులకు చమురు సంస్థలు మరో షాక్ ఇచ్చాయి. 14కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.50 పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో తెలంగాణలో సిలిండర్ రూ.1002కు చేరింది. ఏపీలో అయితే సిలిండర్ ధర రూ.1008కు పెరిగింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై.. ఈ ధరల పెంపుతో పెనుభారం పడింది.
