అటు ఏపీ ఇటు తెలంగాణలో దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. ఏపీలో లీటర్ పెట్రోల్‌పై 88పైసలు, డీజిల్ పై 83పైసలు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.80కి చేరుకోగా, డీజిల్ ధర రూ.96.83కు పెరిగింది. తెలంగాణలో లీటర్ పెట్రోల్ పై రూ 90పైసలు, డీజిల్ 87పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.10, డీజిల్ రూ.95.49కి చేరుకుంది.
