పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా లేటెస్ట్ గా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ రాధే శ్యామ్. ఇందులో హీరోయిన్ గా బుట్టబొమ్మ ..హట్ బ్యూటీ పూజా హెగ్డే నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మళ్లీ పనిచేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది .
‘ రాధేశ్యామ్ కోసం ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మరలా ఆయనతో కలిసి సినిమా చేయాలని ఉంది. ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే ఆయన్ని బాహుబలి-3 చేయమని.. అందులో నన్నే హీరోయిన్గా తీసుకోమని చెప్తా’ అని పూజా తెలిపింది.