నెల్లూరు: ఎన్నాళ్లు వెంటపడుతున్నా ప్రేమించడం లేదని ఓ విద్యార్థినిని ఆటో డ్రైవర్ గొంతు కోసేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో జరిగింది. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన ఓ విద్యార్థిని (17 సంవత్సరాలు) ఇంటర్ చదువుతుంది. ఆ ఏరియాకే చెందిన ఆటో డ్రైవర్ కృష్ణ ప్రేమ పేరుతో విద్యార్థిని గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయం విద్యార్థిని ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబసభ్యులు కృష్ణ వార్నింగ్ ఇచ్చారు.
దీంతో కోపం పెంచుకున్న ఆటో డ్రైవర్.. ఈరోజు ఉదయం ఇంట్లో పడుకుని ఉన్న విద్యార్థిని గమనించి ఎవరూ లేని సమయంలో అక్కడికి వెళ్లాడు. ఆ తర్వాత కత్తితో విద్యార్థిని గొంతు కోసేసి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లు విద్యార్థిని పడి ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోపు గాయాలపాలైన విద్యార్థిని హాస్పిటల్కు తీసుకెళ్లారు. అనంతరం నిందితుడిని స్థానికులు పోలీసులు అప్పగించారు.