త్వరలో రిలీజ్ కానున్న RRR సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి మూడు రోజులపాటు సాధారణ థియేటర్లలో రూ.50 వరకు, తర్వాత మూడు రోజులు రూ.30 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌ల్లో తొలి మూడు రోజులు రూ.100 వరకు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు థియేటర్లలో ఐదో ఆటకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సినిమా ప్రదర్శించుకోవడానికి అవకాశం కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది.
ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. దుబాయ్‌లో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తికాగా నేటి నుంచి ఈనెల 23 వరకు మనదేశంలో ప్రచారం కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈరోజు కర్ణాటకలో చిక్‌బళ్లాపూర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది.