సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ అందాల రాక్షసి రష్మికా మంధాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్,అనసూయ,కేశవ ఆలియాస్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని,వై. రవి శంకర్ నిర్మాతలుగా ఛాయాగ్రహణం :మీరోస్లా కూబా బ్రోజెక్,కూర్పు:కార్తీక శ్రీనివాస్ ,సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించగా డిసెంబర్ 17,2021న విడుదలైన పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిన సంగతి విధితమే.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం అల్బమ్ ఎంతటి ఘన విజయం సాధించిన సంగతి కూడా తెల్సిందే. స్టార్ హీరోయిన్.. అందాల రాక్షసి సమంత నర్తించి మెప్పించిన ఊ అంటావా.. ఊ ఊ అంటవా మామా అనే పాట ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు.
అయితే పుష్ప -2 లో కూడా ఐటెం సాంగ్ పెట్టనున్నట్లు దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ పాటకు సమంత లెక్క బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్ .. అందాల రాక్షసి ఒకర్ని ఎంపిక చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ టూ లో ఉన్న ఇద్దరు హీరోయిన్లను ఇప్పటికే సంప్రదించినట్లు కూడా వార్తలు. చూడాలి మరి ఎవర్ని ఎంపిక చేస్తాడో సుక్కు …