ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హ్యాకర్స్ గట్టి షాకిచ్చారు. ఇందులో భాగంగా టీడీపీకి చెందిన ట్విట్టర్ అకౌంటును హ్యాక్ చేశారు. అయితే హ్యాకింగ్ గురైన అంశాన్ని గుర్తించిన ఆ పార్టీకి చెందిన ప్రధాన ఐటీ విభాగం వెంటనే అప్రమత్తమై నివారణ చర్యలను చేపట్టింది.
ఈ క్రమంలో టీడీపీ ట్విట్టర్ అకౌంట్ నుండి అసభ్యకరమైన ట్వీట్లను,మెసేజ్ లను పంపినట్లు ఐటీ విభాగం గుర్తించింది. అంతే తప్పా ఎలాంటి నష్టం జరగలేదని నిర్ధారించింది.తమ పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ గురైన అంశం గురించి ఆ పార్టీకి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు స్పందిస్తూ టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైంది.ఈ అకౌంట్ ను పునరుద్ధరించేందుకు ట్విట్టర్ ఇండియాతో మాట్లాడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.