తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నిన్న సాయంత్రం ఉత్తర్వులను జారీ చేసింది. 1992బ్యాచ్ తెలంగాణ ఐఏఎస్ అధికారి అయిన వికాస్ రాజ్ ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు.
సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన రాష్ట్రంలో ఎలాంటి ఇతర పోస్టుల్లో కొనసాగరాదు. అదనపు బాధ్యతలో సైతం ఉండరాదు అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వికాస్ రాజ్ గతంలో పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.