దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల సమయంలో ముడి చమురు ధర బ్యారెలు 81 డాలర్ల- 130 డాలర్లకు పెరిగింది. ఈ నెల పదో తారీఖున విడుదలైన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేస్తారని విశ్లేషకులు అంచనా వేశారు.
కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే ఈ శుక్ర లేదా శనివారం రోజున పెట్రో ధరల పెంపునకు సంబంధించిన ప్రకటన వెలువడవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.