గత రెండు వారాలుగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో బాంబులతో దాడులు చేస్తున్న రష్యాను ఉక్రెయిన్ పై మిలటరీ దాడిని వెంటనే ఆపాలని అంతర్జాతీయ హైకోర్టు ఆదేశించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ బలగాలను వెనక్కి రప్పించాలని ఈ సందర్భంగా సూచించింది. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంతర్జాతీయ కోర్టులో తామే గెలిచాము. ఇంటర్నేషనల్ లా ప్రకారం కోర్టు ఆదేశాలను రష్యా తప్పక పాటించాలని ఆయన అన్నారు.