తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు మరొకసారి వార్తల్లోకి కెక్కారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారం గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో శత్రువులను నమ్మిన పర్వాలేదు కానీ ద్రోహులను మాత్రం నమ్మొద్దని తెలిపారు.
పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు అన్ని సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్ లొ ఉన్న అన్ని పనులన్నింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి పూర్తి చేయించేందుకు తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా హమీ ఇచ్చారు.
అయితే అంతకుముందు గువ్వలగూడెం నుండి చెరువు మాధారం వరకు జరిగిన భారీ బైకు ర్యాలీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తానే స్వయంగా బుల్లెట్ బండి నడిపి కార్యకర్తల్లో,ప్రజల్లో జోష్ ను నింపారు.