తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి ,ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీలో చేరబోతున్నారా..?. గతంలో తిరుమల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో చేరతానని ప్రకటించిన వార్త ఇప్పుడు నిజం కాబోతుందా..?.
అంటే అవుననే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన అర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్ త్వరలోనే బీజేపీలో చేరనున్నారు.
అందుకే ప్రధానమంత్రి నరేందర్ మోదీతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ అయ్యారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఉదయం సీఎం కేసీఆర్ ను పొగుడుతారు. రాత్రి అయ్యేసరికి ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలుస్తారంటూ హెద్దేవా చేశారు.వాళ్ల వైఖరీ ఎంటో వాళ్లకే ఆర్ధం కాదు. వాళ్లను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేయించాలని అన్నారు.