చాలా మందికి నిద్ర పట్టకపోతేటీవీ కానీ, ఫోన్ కానీ చూస్తుంటారు. దీనివల్ల కళ్లు మరింత అలిసిపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మంచిగా నిద్రపట్టాలంటే వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫోన్ జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం వల్ల సులువుగా నిద్రలోకి జారుకోవచ్చు. అలాగే పక్కకు కాకుండా.. వెల్లకిలా పడుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
