తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఫస్టియర్ పరీక్షలు 6 నుంచి మే 23వ తేదీ వరకు, సెకండియర్ పరీక్షలు 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.
ఫస్టియర్ షెడ్యూల్
మే 6(శుక్రవారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 9(సోమవారం) – ఇంగ్లీష్
మే 11(బుధవారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
మే 13(శుక్రవారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
మే 16(సోమవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 18(బుధవారం) – కెమిస్ట్రీ, కామర్స్
మే 20 (శుక్రవారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1
మే 23(సోమవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి
సెకండియర్ షెడ్యూల్
మే 7(శనివారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 10(మంగళవారం) – ఇంగ్లీష్
మే 12(గురువారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
మే 14(శనివారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
మే 17(మంగళవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 19(గురువారం) – కెమిస్ట్రీ, కామర్స్
మే 21 (శనివారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2
మే 24(మంగళవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి
పది పరీక్షల షెడ్యూల్
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
పరీక్షల టైం టేబుల్..
మే 23(సోమవారం) – ఫస్ట్ లాంగ్వేజ్
మే 24(మంగళవారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 25(బుధవారం) – థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
మే 26(గురువారం) – గణితం
మే 27(శుక్రవారం) – భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం
మే 28(శనివారం) – సాంఘిక శాస్త్రం
మే 30(సోమవారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1
మే 31(మంగళవారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
జూన్ 1(బుధవారం) – ఎస్ఎస్సెసీ ఒకేషనల్ కోర్సు(థియరీ). ఉదయం 9:30 నుంచి 11:30 వరకు