హైదరాబాద్: షార్ట్ ఫిల్మ్‌లు, సోషల్ మీడియాలో కామెడీ వీడియోలతో అలరించిన ప్రముఖ యూట్యూబర్ బమ్చిక్ బబ్లూ ఓ ఇంటి వాడయ్యాడు. తన లవర్ శ్రీవల్లిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఆర్య సమాజ్‌లో అతికొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో వారి వివాహం జరిగింది. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను బబ్లూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పెట్టి తన భార్యను పరిచయం చేశారు. ఈ సందర్భంగా జీవితంలో కొత్త చాప్టర్‌కి ఛీర్స్ అని పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తనదైన శైలి కామెడీ టైమింగ్‌తో బబ్లూ అలరిస్తుంటాడు. ఎక్కువగా కామెడీ సీన్స్‌తోనే నెటిజన్లను నవ్విస్తుంటాడు. ప్రస్తుతం ‘బబ్లూ మాయ’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంటర్టైన్ చేస్తుంటాడు.