అమరావతి: జనసేన ఆవిర్భావ సభ ఆ పార్టీ ప్రమోషన్ కోసం కాదని.. పార్టీని అమ్ముకునేందుకని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సభకు ఇన్ని వేల మంది హాజరయ్యారు..నాకెంత ప్యాకేజీ ఇస్తారని అడిగేందుకే పవన్ కల్యాణ్ ఈ సభ పెట్టారని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ వద్ద ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై విమర్శలు చేశారు.
సినిమాల్లో పదిమందిని కొట్టినంత మాత్రాన హీరో కాదని పవన్‌ను ఉద్దేశించి ద్వారంపూడి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో హీరోయిజం వేరని.. సీఎం జగన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. పవన్ కల్యాణ్‌కు చేతనైతే ఒంటరిగా పోరాడాలని.. అప్పుడే ప్రజలు ఆయన్ను హీరోగా గుర్తిస్తారన్నారు. సినిమాల్లో పవన్ హీరో అయితే.. పాలిటిక్స్‌లో జగన్ రియల్ హీరో అని చెప్పారు. తన జోలికొస్తే ఊరుకున ప్రసక్తే లేదని.. తాను శాంతిపరుడిని కాదని ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొంతమంది నేతలు తెలిసో తెలియకో జనసేనలో చేరుతున్నారని.. వారిని పొత్తుల ద్వారా పవన్ ముంచుతున్నాడని విమర్శించారు.