తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది నేషనల్ క్రష్ .. అందాల రాక్షసి రష్మికా మందాన్న. పుష్ప హిట్ చిత్రంతో మంచి ఊపులో ఉంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా యువ హీరో రామ్, హిట్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ రష్మికను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మూవీ కథను ఆమెకు చెప్పగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
త్వరలోనే అధికారిక ప్రకటన ఉండనుందట. చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుకుంటున్న బోయపాటి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.