హిజాబ్ వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో యావత్ అఖండ భారతావనికి తెల్సిందే. ఈ వివాదంతోనే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారాన్ని దక్కించుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా హిజాబ్ పై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది. హిజాబ్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కోట్టేసింది.హిజాబ్ ధరించడం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని ఈ సందర్భంగా హైకోర్టు తెలిపింది.