హైదరాబాద్ జేఎన్టీయూలో ఈనెల 15, 16 తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సురేష్ వెల్లడించారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద్య వరకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. అన్ని రకాల కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సాధారణ డిగ్రీలు పూర్తి చేసిన వారితో పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీకామ్/బీఏతో పాటు పీజీలు పూర్తి చేసి ఉండాలని.. అటు టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలకు ఐటీ, టెక్నాలజీ రంగానికి చెందిన ఉద్యోగాలకు బీటెక్/ఎంటెక్ పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు.మరోవైపు ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ మణికొండలో టీ-సేవ కేంద్రం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు మణికొండ ల్యాంకో హిల్స్‌లోని సంపూర్ణ సూపర్ మార్కెట్‌పై బిల్డింగ్‌లో జాబ్‌మేళా ఉంటుందన్నారు. ఈ జాబ్‌మేళాలో ఇంటర్, పీజీ, ఇంజినీరింగ్, ఎంబీఏ అర్హత గల అభ్యర్థులు పాల్గొనవచ్చని, ఆసక్తి గల వారు వాట్సాప్ ద్వారా కూడా బయోడేటాను పంపవచ్చని తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 102 పేరొందిన ప్రైవేటు కంపెనీలు పాల్గొంటున్నట్లు చెప్పారు. వివరాలకు 9505800048లో సంప్రదించాలని సూచించారు.