తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ తేజ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కు సంబంధించిన ఓ లుక్ కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు లీకైంది. ఈ వీడియోలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కన్పించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో ఫిల్మ్ నగర్లో విన్పిస్తున్న వార్తలకు బలం చేకూర్చుతుంది. ఈ చిత్రానికి సర్కారోడు అని టైటిల్ ఖరారు అయినట్లు కూడా మరో వార్త.