తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు బిగ్ షాకిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తార్నాకలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు అయిన మాజీ ఎంపీ వీహెచ్,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు,జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, కోదండరెడ్డి, కమలాకర్ రావు, జి.నిరంజన్, శ్యామ్ మోహన్ తో పాటు పలువురు నేతలు సమావేశమయ్యారు. వీరంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయాలపై కొంత అసంతృప్తితో ఉన్నారు.
