హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీతో పాలమూరుకు ఏం మేలు జరిగిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. కొల్లాపూర్ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడారు.
పీసీసీ అధ్యక్ష పదవిని వ్యాపారాల కోసం రేవంత్ వాడుకుంటున్నారని ఆరోపించారు. భయం వల్లే కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం లేదన్నారు. మల్కాజ్‌గిరిలో గెలిచే సత్తా రేవంత్‌కు ఉందా? అని బాలరాజు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఎస్సీలపై చేసిన కామెంట్లను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్‌కు ధైర్యముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.