హైదరాబాద్: ఇతర దేశాలకు వెళ్లి మెడిసిన్ చదివే అవసరం లేకుండా రాష్ట్రంలోనే మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచామని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్రావు అన్నారు. శాసనసభ క్వశ్చన్ అవర్లో హరీష్రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు.
ఉమ్మడి పరిపాలనలో ఉన్నప్పుడు ఏపీలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఆ అవకాశమే ఉండేది కాదని చెప్పారు. ఇదే సభలో అనేక సార్లు ప్రశ్నించామని.. బయట కూడా పోరాడామని గుర్తు చేశారు. 60 ఏళ్లలో తెలంగాణకు మూడు కాలేజీలు ఉంటే.. ఈ ఆరేళ్లలో ఆ సంఖ్యను 33కి పెంచామని హరీష్ వివరించారు. దేశంలోనే ఇంత భారీ ఎత్తున మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచించాలని కోరారు.