Home / ANDHRAPRADESH / గౌతమ్‌రెడ్డి శాఖలు బుగ్గనకు కేటాయింపు.. ఉత్తర్వులు జారీ

గౌతమ్‌రెడ్డి శాఖలు బుగ్గనకు కేటాయింపు.. ఉత్తర్వులు జారీ

విజయవాడ: గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శాఖలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి గౌతమ్‌రెడ్డి శాఖలు అప్పగించారు. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, పెట్టుబడులు-మౌలిక వసతులు, టెక్స్‌టైల్స్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలను బుగ్గనకు కేటాయిస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం ఏడు శాఖలు బుగ్గన పరిధిలోకి వచ్చినట్లయింది.

ఇప్పటికే బుగ్గన కీలకమైన ఆర్థికశాఖతో పాటు శాసనసభ వ్యవహారాలు, వాణిజ్య పన్నుల శాఖలకు అదనంగా ఐటీ, పరిశ్రమలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనాశాఖలను అప్పగించారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat