అమరావతి: ఏపీ సీఎం జగన్తో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు.
త్వరలో RRR సినిమా రిలీజ్ కానుంది. మార్చిన 25 ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో RRR బెనిఫిట్షోలకు పర్మిషన్, సినిమా టికెట్ ధరలపై సీఎంతో రాజమౌళి, దానయ్య చర్చించినట్లు సమాచారం. దర్శక, నిర్మాతల విన్నపం మేరకు RRR సినిమాకు సంబంధించిన అనుమతులను ఏపీ ప్రభుత్వం ఇచ్చే అవకాశముంది.