అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన నేచురల్ డెత్స్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు.
కల్తీమద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్‌షాపులను పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేకసార్లు జరిగాయని చెప్పారు. గతంలో లాభాల కోసం బడి, గుడి సమీపంలో కూడా మద్యాన్ని అమ్మారని.. చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి 43వేల బెల్ట్ షాపులు ఎత్తివేశామని.. ఎస్‌ఈబీ (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో)ను ఏర్పాటు చేసి కల్తీమద్యంపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని సీఎం జగన్ వివరించారు.