ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దేశంలో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.దీన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ పేమంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డు లేనివారికి కూడా యూపీఐ పిన్ సెట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
ఆధార్ నంబర్,ఓటీపీ ద్వారా పిన్ సెట్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. దీనికి సంబంధించి గత ఏడాది సర్కులర్ జారీ చేసిన ఎన్పీసీఐ . ఇందుకు డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు గడువు విధించింది. అయితే ఆలోపు బ్యాంకులు చర్యలు తీసుకోలేకపోవడంతో ఈ గడువును తాజాగా ఈ నెలాఖరు వరకు పొడిగించింది.
అయితే ఇప్పటివరకు యూపీఐ నగదు చెల్లింపులు కేవలం డెబిట్ కార్డు తప్పనిసరిగా అనే రూల్ ఉంది. అయితే దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు చాలా మంది బ్యాంకు ఖాతాదారులకు డెబిట్ కార్డులు లేవు. ఇలాంటి వారు ఇప్పుడు ఆధార్ నెంబర్ ,ఓటీపీ ద్వారా యూపీఐ సెట్ చేసుకోవచ్చు.